2015లోనే ప్ర‌భాస్‌కి క‌థ చెప్పా

Saaho's work began in 2015
Friday, June 14, 2019 - 15:15

"సాహో" సినిమా మొద‌లు ఇప్ప‌టిది కాదు. 2015లోనే "సాహో" సినిమా స్ర్కిప్ట్ మొత్తం ప్ర‌భాస్‌కి చెప్పేశాడ‌ట ద‌ర్శ‌కుడు సుజీత్‌. త‌న తొలి చిత్రం ర‌న్ రాజా రన్ విడుద‌ల‌యిన వెంట‌నే సాహో క‌థ రాసుకున్నాడ‌ట‌. అప్ప‌టికి ఇంకా బాహుబ‌లి సినిమా కూడా విడుద‌ల కాలేదట‌. తొలి నేరేష‌న్‌లోనే క‌థ విని ప్ర‌భాస్ ఓకే చేశాడ‌ట‌. అంటే నాలుగేళ్లుగా సుజీత్ ఈ సినిమా మీదే ఉన్నాడు.

బాలీవుడ్ మార్కెట్ కోసమ‌ని కాకుండా త‌న క‌థ‌కి వాళ్లు సూట్ అవుతార‌నే ఉద్దేశంతోనే శ్ర‌ద్దాక‌పూర్‌, నీల్ నితిన్ ముఖేష్‌, జాకీ ష్రాప్‌, చుంకీ పాండే, మందిరాబేడీ వంటి బాలీవుడ్ తార‌ల‌ను తీసుకున్నాడ‌ట‌. మ‌నం న‌మ్మాలి మ‌రి!

"సాహో" సినిమా టీజ‌ర్ తొలి రోజే 60 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌ని పొందింది. సినిమాలోని యాక్ష‌న్ సీన్లు, విజువ‌ల్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో కొంత టెన్స‌న్ త‌గ్గిందంటున్నాడు ఈ యువ ద‌ర్శ‌కుడు. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌ని చేశారు