సాయి తేజ్‌..ఒక్క‌దానితోనే ఆపేశాడా?

Sai Dharam Tej is not continuing his sentiment
Monday, June 24, 2019 - 14:45

ఇటీవ‌ల సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న పేరుని మార్చుకున్నాడు. సాయి్ తేజ్ అని షార్ట్ చేసుకున్నాడు. ధ‌ర‌మ్‌ని క‌ట్ చేశాడు. వ‌రుస‌గా ఫ్లాప్‌లు వ‌స్తుండ‌డంతో దానికి అడ్డుక‌ట్ట ఎలా వేయాలా అని ఆలోచించి న్యూమారాల‌జీ ప్ర‌కారం సాయితేజ్ అని పేరుని కుదించుకున్నాడు. దాంతో చిత్ర‌ల‌హ‌రి అనే సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సినిమా క్రెడిట్స్‌లోనే త‌న పేరును సాయితేజ్‌గా వేసుకున్నాడు. న్యూమరాల‌జీ ప్ర‌కారం యావ‌రేజ్ విజ‌యం సాధించింది.

ఐతే ఇదే పేరుని అన్ని విష‌యాల్లో కంటిన్యూ చేయడం లేదు. ట్విట్ట‌ర్‌లో ఇప్పటికీ త‌న ఫుల్ నేమ్‌నే కంటిన్యూ చేస్తున్నాడు. మీడియా కూడా అదే పేరుతో రాస్తోంది. బ‌య‌ట త‌న రెగ్యుల‌ర్ నేమ్‌నే వాడుతున్నాడు ఈ మెగా హీరో. ఐతే సినిమా టైటిల్స్ వ‌ర‌కు షార్ట్ నేమ్‌నే వాడుతాడ‌ట‌.

తాజాగా ప్రారంభ‌మైన ప్ర‌తిరోజు పండ‌గే సినిమాకి సాయి తేజ్ అనే పేరునే వాడుతున్నాడు. ప్రెస్‌కి విడుద‌ల చేసిన నోట్‌లో కూడా సాయి తేజ్ అనే ఉంది. అంటే తెర‌పై సాయి తేజ్‌, మిగ‌తా వాటికి సాయిధ‌ర‌మ్ తేజ్ అన్న‌మాట‌. ఇక‌ మారుతి డైర‌క్ష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం డ్రాస్టిక్‌గా త‌గ్గాడ‌ని అన్నారు కానీ స్వ‌ల్పంగానే త‌గ్గాడు. ఫ‌ర్‌ఫెక్ట్‌గా మారాడు. మ‌రీ స‌న్నగా కాలేదు, లావుగానూ లేడు.