సాయి ధరమ్ తేజ్ ఆశలన్నీ దీనిపైనే

Sai Dharam Tej's last hope
Wednesday, April 10, 2019 - 11:15

సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సాయి తేజ్ అయ్యాడు. ఈ హీరో నటించిన "చిత్రలహరి" సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్ అనే పేరు పడుతుంది. ధరమ్ ఎగిరిపోయింది. ఐతే, ఇది లక్ కోసం చేసిన మార్పు కాదంటున్నాడు. న్యూమరాలజీ, జ్యోతిష్యం నమ్మి ఈ మార్పు చెయ్యలేదని కవరింగ్ ఇచ్చాడు. సినిమా థీమ్ ప్రకారం ఇలా కూల్ గా షార్ట్ చేశాడట

వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు సాయితేజ్, ఇది కూడా ఆడకపొతే చాలా కష్టం. అందుకే ఇలా చేస్తున్నాడు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
తన పేరులో ధరమ్ అనే పదం అలానే ఉంటుందంటున్నాడు. అయితే "చిత్రలహరి" రిలీజ్  తర్వాత ఆ షార్ట్ పేరే కొనసాగిస్తాడా అనేది చూడాలి.

ఈ సినిమాని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి మంచి బిజినెస్సే జరగడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం ఒక రీజన్. మరోటి... విడుదలైన ట్రయిలర్స్, టీజర్స్, సాంగ్స్ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి.

ఐతే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ సంగతి ఎలా ఉన్నా... విడుదలయ్యాక బాగా ఆడడం ముఖ్యం. అపుడే సాయి ధరమ్ కి ముందు ముందు మార్కెట్ ఉంటుంది. లేదంటే మెగా హీరో అనే ఇమేజ్ తోనే ఇంకా నెట్టుకురావడం కష్టం.

"చిత్రలహరి" సినిమాకి దర్శకుడు కిషోర్ తిరుమల. అతను ఇంతకుముందు తీసిన "నేను శైలజ" బాగా ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చిన "వున్నది ఒక్కటే జిందగీ" నిరాశపర్చింది. మరి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ సక్సెస్ ట్రాక్ లో వస్తాడా?