ఆటోరాణిగా సాయి ప‌ల్ల‌వి

Sai Pallavi's swag as Autorani
Thursday, November 8, 2018 - 15:45

సాయి ప‌ల్ల‌వి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె అద్భుత‌మైన న‌ట‌న‌నే చూశారు కానీ ఆమె స్టెప్పులేస్త రంగ‌స్థ‌లం అదిరిపోద్ది. ఇపుడు ఆమెకి ఆ అవ‌కాశం ఒక తమిళ సినిమాలో ద‌క్కింది.

ధనుష్ సరసన 'మారి 2' చిత్రంలో నటిస్తోంది సాయి ప‌ల్ల‌వి. దీపావ‌ళి సంద‌ర్భంగా ఆమె స్టిల్స్ కొన్నింటిని విడుద‌ల చేశారు. సాయిప‌ల్ల‌వి స్వాగ్ అంటూ తెలుగు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా ఆ స్టిల్స్ చూసి ఫిదా అయిపోయి, ట్వీట్ చేశాడు. ఆటోరాణి గెట‌ప్‌లో అద‌ర‌గొట్టింది ఫిదా పిల్ల‌. 'బాషా' సినిమాలో రజనీకాంత్‌ లుక్ ని త‌ల‌పిస్తోంది ఈ బ్యూటీ.

ఆ లుక్‌తో పాటు ఆమె వేసిన స్టెప్పుల‌కి సంబంధించి కూడా ఒక ఫోటో రిలీజ్ చేశారు. డిసెంబ‌ర్ 21న ఆమె న‌టించిన తెలుగు సినిమా 'ప‌డి ప‌డి లేచే మ‌న‌సు' విడుద‌ల కానుంది. అలాగే సూర్య న‌టించిన 'ఎన్‌జీకే' కూడా రానుంది. ఇందులో ఆమె ఒక హీరోయిన్‌. వ‌చ్చే ఏడాది 'మారి 2' విడుద‌ల అవుతుంది. ఓవ‌రాల్‌గా డిసెంబ‌ర్ నుంచి సాయి ప‌ల్ల‌వి హ‌వా మొద‌ల‌వుతుంది.