ఈ భామ ఉద్దేశ్యం ఏంటి?

Sakshi Chaudhary's real intention in posting hot pics
Monday, February 11, 2019 - 11:15

దాదాపు ప్ర‌తి హీరోయిన్ ఇపుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్ట‌ర్‌లో హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తుంది. ఐతే కొంద‌రు హీరోయిన్లు మాత్ర‌మే అలాంటి ఫోటోల‌తోనే ఫాలోవ‌ర్స్ పెంచుకోవాల‌నో, అవ‌కాశాలు అందిపుచ్చుకోవాల‌నే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఐతే అలాంటి హీరోయిన్లు కూడా త‌మ అకౌంట్ ద్వారా ఇత‌రత్రా వేరే ఫోటోలు, ఇత‌ర అంశాల‌ను అప్‌డేట్ చేస్తుంటారు. కానీ ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే వర‌కు గంట గంట‌కీ, త‌న పాత‌, కొత్త ఫోటోల‌ను ఒక హీరోయిన్ పోస్ట్ చేయ‌డం అనేది విచిత్రంగానే చెప్పుకోవాలి. 

అలా చేస్తున్న భామ సాక్షి చౌద‌రి. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న "జేమ్స్ బాండ్‌", "సెల్పీరాజా", గోపిచంద్ స‌ర‌స‌న "ఆక్సిజ‌న్" వంటి సినిమాల్లో న‌టించిన ఈ భామ తాజాగా ట్విట్ట‌ర్‌లో హాట్ హాట్ ఫోటోలు అప్‌డేట్ చేస్తోంది. ఇలా వ‌రుస‌గా అవే ఫోటోలు పెడుతుంటే ఆ మ‌ధ్య ఒక ఆక‌తాయి కుర్రాడు రాత్రికి వ‌స్తావా అని అడిగాడ‌ట‌. ఆ విష‌యాన్ని కూడా ఆమే పోస్ట్ చేసింది. 

ఒక్క రాత్రి తనతో పడుకుంటే కోటి రూపాయలిస్తానంటూ ఓ వ్యక్తి తనకు రిప్ల‌యి పెట్టిన విషయాన్ని బయటపెట్టింది సాక్షి. ఐతే ఐయామ్ నాట్ ఫర్ సేల్ అని సమాధానమిచ్చింది ఈ భామ‌. ఈ అందాల భామ నటించిన "సువర్ణసుందరి" సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇంత‌కీ ఈ ముద్దుగుమ్మ అస‌లు ఉద్దేశ్యం ఏంటో?