స‌ల్మాన్‌కి అంత‌ సీన్ లేదంటున్న మ‌హిళ‌లు

Salman Khan gets trolled over his comment about Priyanka
Tuesday, May 28, 2019 - 18:15

స‌ల్మాన్‌ఖాన్ చాలా అంద‌గాడు. ప్రేమ పావురాలు (మైనే ప్యార్ కియా) స‌మ‌యంలో ఎంత అందంగా ఉన్నాడో 50 ప్ల‌స్ ఏజ్‌లోనూ హ్యండ్‌స‌మ్‌గానే ఉన్నాడు. స‌ల్మాన్ అందంగా ఉన్న మాట వాస్త‌వ‌మే ఐనా ఆయ‌న కోసం భ‌ర్త‌ల‌ని వ‌దిలేసి ప‌రిగెత్తుకు వ‌చ్చేంత ప‌రిస్థితి కూడా లేద‌నేది వాస్త‌వం. అలాంటి సీన్‌ని షారూఖ్‌ఖాన్ విష‌యంలో ఊహించొచ్చు. ఎందుకంటే షారూఖ్ బ‌ల‌మంతా విమెన్ ఫాలోయింగ్‌. మాస్‌లో స‌ల్మాన్‌ని మించిన వారు లేరు కానీ స‌ల్మాన్‌కి లేడీస్‌లో అంత ఫాలోయింగ్‌ లేదు. 

అందుకే స‌ల్మాన్‌ఖాన్ ఇటీవ‌ల చేసిన కామెంట్ బాగా ట్రోలింగ్‌కి గుర‌వుతోంది. నా కోసం మొగ‌ళ్ల‌ని కూడా వ‌దిలేసి వ‌స్తారు కొంద‌రు భార్య‌లు అంటూ మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నాడు స‌ల్మాన్‌ఖాన్‌. ఆయ‌న న‌టించిన భ‌ర‌త్ సినిమా విడుద‌ల‌కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా ఈ కామెంట్ చేసి ట్రోలింగ్‌కి గుర‌వుతున్నాడు. ఈ సినిమాలో మొద‌ట ప్రియాంక‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఐతే నిక్ జోనాస్‌తో పెళ్లి కుద‌ర‌డంతో సినిమాని వ‌దిలేసి పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉండిపోయింది. ఆమె స్థానంలో క‌త్రినని తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ...... ప్రియాంక‌కి నా సినిమా క‌న్నా ఆమెకి పెళ్లి ముఖ్య‌మయింది. వేరే అమ్మాయిలకి నా సినిమాలో ఛాన్స్ వ‌స్తే క‌ట్టుకున్న వాడిని కూడా వ‌దిలేసి వ‌స్తారు అంటూ మాట్లాడాడు.

దీనిపై మ‌హిళ‌సంఘాలు మండిప‌డుతున్నాయి. స‌ల్మాన్‌ఖాన్ మేల్ ఛావ‌నిస్ట్ (పురుషాధిక్య భావాజలం ఉన్న వ్య‌క్తి) అంటూ, ప‌క్కా క్లాస్‌లెస్ గై అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు, సోష‌ల్ మీడియాలోనూ జ‌నం ఓ రేంజ్‌లో స‌ల్మాన్‌ని ఆడుకుంటున్నారు. 53 ఏళ్ల ఈ బ్ర‌హ్మ‌చారి త‌న‌కి ఏజ్‌బార్ అయింద‌న్న విష‌యం గుర్తించ‌డం లేదు అంటూ కామెంట్లు ప‌డుతున్నాయి.