ఆ కండీష‌న్ కంప‌ల్స‌రీ...స‌మంత‌

Samantha and Chaitu's fifth combination
Tuesday, May 28, 2019 - 22:15

స‌మంత ఆమె భ‌ర్త చైత‌న్య‌.. ఇద్ద‌రిది హిట్ పెయిర్‌. రియ‌ల్ లైఫ్‌లోనే కాదు రీల్‌లైఫ్‌లోనూ సూప‌ర్ క్యూట్ జంట‌. "మ‌జిలీ"తో వారికున్న క్రేజ్ ఏంటో బాక్సాఫీస్‌కి తెలిసింది. మ‌రి వీరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ఎపుడు?

"మ‌జిలీ" సినిమా దాదాపు 40 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూళ్లు అందుకోవ‌డంతో వెంట‌నే ఈ కాంబినేష‌న్‌లో ఇంకో సినిమాని కానిచ్చేద్దామ‌నుకునే నిర్మాత‌ల‌కి, ద‌ర్శ‌కుల‌కి ఒక కండీష‌న్ పెట్టింద‌ట స‌మంత‌. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగు సినిమాల‌కి భిన్న‌మైన‌, కొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో కూడిన స్క్రిప్ట్‌ని తీసుకొస్తేనే ఒప్పుకుంటుంద‌ట‌.

ఏ మాయ చేశావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం, మజిలీ చిత్రాల త‌ర్వాత త‌మ కాంబినేష‌న్‌లో వ‌చ్చే చిత్రంపై ప్రేక్ష‌కుల అంచ‌నాలు పెరిగిపోయాయి కాబ‌ట్టి కొత్త త‌ర‌హా క‌థ ఉండాల‌ట‌.