అలాంటి పాత్రలే చేస్తా: స‌మంత‌

Samantha to be choosy
Monday, April 15, 2019 - 17:00

కథాబలమున్న సినిమాలే చేస్తాను అంటోంది సమంత. "మజిలీ" సినిమా 10 రోజుల్లో 32 కోట్ల రూపాయలు సంపాదించింది. దాంతో ఆమె చాలా ఆనందంగా ఉంది. తన భర్తకి ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు యమా ఖుషీగా ఉంది.

Nizam : 11.08 Cr
Ceeded : 3.82 Cr
UA : 3.70 Cr
East : 1.52 Cr
West : 1.15 Cr
Krishna : 1.66
Guntur : 1.90 Cr
Nellore : 0.75 Cr
KA + ROI : 3.65 Cr
OS : 3.70 Cr
Total Share 10 days: Rs 32 Cr

ఈ సినిమాలో తన పాత్రకి బాగా పేరు వచ్చిందని మరింత హ్యాపీనట. సమంత ఇకపై తనకి ఇలా ప్రాధాన్యం ఉండే సినిమాలే చేస్తుందట. బేబీ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసింది. అది విడుదలయ్యాక తన ఇమేజ్ మరింత పెరుగుతుందని భావిస్తోంది.

తాజాగా శర్వానంద్‌తో 96 రీమేక్ ఒప్పుకొంది. ఇందులోనూ ఆమె పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.