స‌మంత‌కి అక్క‌డా ఉంది ట‌ట్టూ

Samantha displays her secret Tattoo
Monday, July 8, 2019 - 19:30

స‌మంత జాత‌కం బాగుంది. ప్ర‌తి సినిమా బ్లాక్‌బ‌స్ట‌రే అవుతోంది. ఆ ఆనందంలో ఆమె త‌న కొత్త కొత్త ఫోటోల‌ను అప్‌డేట్ చేస్తోంది. తాజాగా తెల్ల‌ని డ్రెస్సుతో ఒక ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేసింది. చేతులు పైకెత్తే ఫోజు ఇది. ఈ క్ర‌మంలో ఆమె ఇన్నాళ్లూ మామూలు జ‌నాల‌కి క‌న‌ప‌డ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ వ‌స్తున్న సీక్రెట్ ట‌ట్టూ పొజిష‌న్ బ‌య‌ట‌ప‌డింది.

త‌న భ‌ర్త చైత‌న్య పేరుని త‌న వ‌క్ష‌స్థ‌లం కింద ట‌ట్టూగా రాయించుకొంది. ఇన్నాళ్లూ దాచిన ఈ ట‌ట్టూని ఇపుడు అంద‌రికీ క‌నిపిస్తోంది.  ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న టాట్టూను రివీల్ చేసింది స‌మంత‌.

నాగ చైత‌న్య‌, స‌మంత‌ల‌ది హిట్ పెయిర్‌. ప్రేమించి పెళ్లాడిన ఈ జంట త్వ‌ర‌లోనే మ‌రో సినిమాలోనూ వ‌చ్చే ఏడాది క‌నిపిస్తార‌ట‌. స‌మంత తాజాగా న‌టించి విడుద‌ల చేసిన ఓ బేబీలో కూడా చైత‌న్య చిన్న గెస్ట్ రోల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.