పారితోషికం పెంచిన మాట నిజమేనా?

Samantha hikes remuneration
Monday, April 22, 2019 - 17:30

పెళ్లయిన తర్వాతే సమంత క్రేజ్ మరింతగా పెరిగింది. పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాతే ఆమెకి సక్సెస్ రేట్ ఎక్కువుంది. పెళ్లి అయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అన్న సూత్రాన్ని కొంతమంది హీరోయిన్లు రాంగ్ అని ప్రూవ్ చేశారు. అలాంటి వారిలో సమంత ఒకరు.

ఇపుడు ఈ భామ పారితోషికం పెంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా "మజిలీ" సినిమా 35 కోట్ల రూపాయల వసూళ్లు అందుకోవడంతో అటు ఆమె భర్త చైతన్య, ఇటు సమంత ఇద్దరూ ఎక్కువ పారితోషికం అడుగుతున్నారట. మజిలీ సక్సెస్ తర్వాత సమంత ఇపుడు 2.50 కోట్లు అడుగుతోందనేది టాక్. ఇందులో నిజమెంత?

ఇటీవలే ఆమె తమిళంలో "సూపర్ డీలక్స్" అనే మూవీలో కూడా నటించి పేరు తెచ్చుకొంది. సమంత ప్రస్తుతం "బేబీ" సినిమాలో నటిస్తోంది.