స‌మంత డ్రీం..రూ.50 ల‌క్ష‌లు

Samantha says her dream was to earn Rs 50 lakhs
Monday, June 17, 2019 - 10:45

స‌మంత ఈ రోజు అగ్ర క‌థానాయిక‌. కానీ ఆమె నేప‌థ్యం సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. చెన్నైలో పుట్టి పురిగిన స‌మంత‌....చిన్న‌పుడు చాలా క‌ష్ట‌ప‌డింది. ఆమె, ఆమె త‌ల్లి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు ఒక ఇల్లు కొనుక్కుని, 50 ల‌క్ష‌ల రూపాయ‌ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అనుకున్నార‌ట‌. 

ఆ ల‌క్ష్యంతోనే స‌మంత సినిమా ఇండ‌స్ర్టీలోకి అడుగుపెట్టింది. కానీ ఇపుడు ఆమె కోట్లు సంపాదించింది. ఆమె డ్రీం ఎపుడో నెర‌వేరింది.

ఇపుడు నాకు దక్కిందంతా ఎక్స్‌ట్రానే అంటూ ఆనందంగానే చెపుతోంది. నేను, "మా అమ్మ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. ఆ క‌ష్టం తెలుసుకాబ‌ట్టే ఇపుడు ఎవ‌రు ఏమి అడిగానా సహాయం చేస్తున్నా," అని చెప్పింది. స‌మంత ఇపుడు అక్కినేని వారి కోడ‌లు. రెండేళ్ల క్రితం నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకొంది. అలాగే తాను గ‌ర్భ‌వ‌తిని అన్న పుకార్ల‌ను తోసిపుచ్చింది.