తెలుగు సినిమాకిది గ్రేట్ టైమ్‌: స‌మంత‌

Samantha says Telugu Cinema is enjoying great phase
Friday, July 19, 2019 - 20:15

తెలుగు సినిమాల‌కి మంచి టైమ్ న‌డుస్తోందిపుడు అని అంటోంది స‌మంత‌. ఇటీవ‌ల అన్ని వైవిధ్య‌మైన సినిమాలే వ‌స్తున్నాయి. మ‌ల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, జెర్సీ, మ‌హ‌ర్షి, దొర‌సాని, ఓ బేబీ ...ఇలా అన్ని వెరైటీ చిత్రాలు, మంచి క‌థాబ‌లంతో కూడిన సినిమాలు వ‌చ్చాయి. తాజాగా వ‌చ్చిన క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్ కూడా బాగా ఆడుతోంది. అంటే మ‌న సినిమాల‌కి మంచి టైమ్ వ‌చ్చిన‌ట్లే క‌దా అని చెపుతోంది స‌మంత‌. 

అడివి శేషు, రెజీన న‌టించిన ఎవ‌రు చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది స‌మంత‌. ఈ సంద‌ర్బంగా మాట్లాడింది ఆమె.

"నాకు టీజ‌ర్ చాలా బాగా న‌చ్చింది. యంగ్ టీమ్ క‌ల‌సిచేసిన ఓ సినిమా. ప్ర‌స్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్‌. ప్ర‌తి ఒక కాన్సెప్ట్ మూవీని ఆద‌రిస్తున్నారు. అంద‌రికీ ధైర్యం వ‌చ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. టీజ‌ర్ మాత్రం చాలా బాగా న‌చ్చింది. క్యూరియాసిటీ పెరిగింది. ప్ర‌తి సన్నివేశం ఆస‌క్తిక‌రంగా ఉంది. డైరెక్ట‌ర్‌ కొత్త‌వాడ‌ని ఎవ‌రూ అనుకోరు. అంత అద్భుతంగా తెర‌కెక్కించారు. అడివిశేష్ కొత్త కంటెంట్ సినిమాతో ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నాడు. త‌న నుండి మ‌రిన్ని సినిమాల‌ను ఎదురుచూస్తున్నాను. రెజీనా మంచి న‌టి. ఆమెకు మంచి అవ‌కాశాలు రావాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఈ సినిమాలో అవ‌కాశం ద‌క్కింది. న‌వీన్‌చంద్ర స‌హా ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌" అన్నారు స‌మంత‌.