సమంత బేబీ రెడీ

Samantha set to release o Baby
Thursday, April 11, 2019 - 13:15

సమంత నటించిన "మజిలీ" సినిమా హిట్ అయింది. ఆమె చాలా ఆనందంగా ఉందిప్పుడు. ఈ ఉత్సాహంతో ఇంకో సినిమాని వెంటనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆమె తదుపరి చిత్రం... "ఓ బేబీ". నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ పూర్తి చేసుకొంది. ఇదే ఊపులో "ఓ బేబీ"ని కూడా సమ్మర్ సెలవుల్లో చివరగా విడుదల చెయ్యాలనుకుంటున్నారట 

"ఓ బేబీ"లో సమంత పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ మూవీలో ఆమె 60 ఏళ్ళ బామ్మ. అలాంటి బామ్మ 25 ఏళ్ళ భామగా మారుతుంది ఉన్నట్టుండి. అదెలా సాధ్యం? అదే ఈ సినిమాలోని గమ్మత్తు. ఈ యంగ్ తరంగ్ గా సమంత కనిపించంనుంది. బామ్మ పాత్రని సీనియర్ నటి లక్ష్మి పోషిస్తోంది.