మా ఆయన మగాడు: స‌మంత‌

Samantha talks about Naga Chaitanya
Tuesday, July 9, 2019 - 19:30

"ఓ బేబీ" సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తనకు కాబోయే మొగుడు ఎలా ఉండాలనే ప్రశ్నకు సమాధానంగా మంచమెక్కితే మగాడిలా కాపురం చేయాలంటూ డైలాగ్ చెబుతుంది సమంత. ఇదే ప్రశ్న నిజజీవితంలో కూడా ఈ హీరోయిన్ కు ఎదురైంది. ఏ విషయంపైనైనా బోల్డ్ గా స్పందించే సమంత.. ఈ విషయంపై కూడా అంతే సూటిగా రియాక్ట్ అయింది. 

నాగచైతన్య మగాడు అంటోంది సమంత. ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ.. మంచంపై ఓ మగాడు ఎలా ప్రవర్తిస్తాడో, అంతకంటే కాస్త ఎక్కువగానే రియాక్ట్ అవుతుంటాడని చెప్పుకొచ్చింది. అంతకంటే ముందు యాంకర్ అడిగిన ప్రశ్నను మరోసారి గుర్తుచేస్తూ.. నలుగురు పిల్లలు కావాలంటే మంచంపై ఆ మాత్రం ప్రదర్శన కనబరచాల్సిందే కదా అంటూ ఎదురుప్రశ్నించింది. సమంత ఇచ్చిన సమాధానంతో అంతా అవాక్కయ్యారు. 

నిజానికి ఇలా బోల్డ్ గా ఉండడం సమంతకు కొత్తేంకాదు. గతంలో ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను భోజనం లేకపోయినా ఉండగలను కానీ, రోజూ సెక్స్ చేయకుండా మాత్రం ఉండలేనంటూ బోల్డ్ గా సమాధానమిచ్చింది. అంతెందుకు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫెమినిజంపై నడుస్తున్న చర్చకు కూడా ఓ రకంగా సమంతానే కారణం. అర్జున్ రెడ్డిలో చెంపదెబ్బలు తనకు నచ్చలేదని, సినిమా మాత్రం తనకు నచ్చిందంటూ ఓపెన్ గా రియాక్ట్ అయింది.