స‌మంత అస్స‌లు త‌గ్గ‌ట్లేదు

Samantha ups glam quotient
Tuesday, June 25, 2019 - 15:45

పెళ్లి అయిన త‌ర్వాత కూడా గ్లామ‌ర్ షో చేస్తారా? అక్కినేని వారింట్లో అడుగుపెట్టిన అమ్మాయిగా ఒద్దిక‌గా, పద్ద‌తిగా ఉండాలి అంటూ అక్కినేని అభిమానులు, ఆన్‌లైన్ ట్రోల‌ర్స్ ఆమెని ఎపుడూ కామెంట్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ట్విట్ట‌ర్లోనూ ఇవే కామెంట్స్‌. మొద‌ట్లో ఇలాంటి వారికి ఘాటుగా స‌మాధానం ఇచ్చింది స‌మంత‌. ఐతే ఇపుడు వాటికి రెస్పాండ్ అవ‌ట్లేదు.

సినిమా న‌టిగా తాను ఎలా ఉండాలో, ఎలా న‌టించాలో, ఎలాంటి డ్రెస్సు వేసుకోవాలో అలానే చేస్తాన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. అందుకే ఫోటోసూట్‌ల విష‌యంలో ఆమె త‌న‌దైన పంథాలోనే వెళ్లోంది. గ్లామ‌ర్ షోకి వెనుకాడ‌డం లేదు.

తాజాగా ఆమె ఒక డిజైన‌ర్ దుస్తుల్లో చేసిన ఈ ఫోటోసూట్ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. వీటిని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ల్‌లో అప్‌లోడ్ చేసుకొంది. స‌మంత న‌టించిన "ఓ బేబీ" చిత్రం జులై 5న విడుద‌ల కానుంది.