స‌మంత వెర్సెస్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌

Samantha vs Kajal Aggarwal
Monday, March 18, 2019 - 15:45

సమంత, కాజల్.ఇద్దరూ థర్టీప్లస్‌లో ఉన్నారు. సమంత ఇప్పటికే చైతన్యని పెళ్లాడింది. కాజల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. 30లలో ఉన్న ఈ భామల అందం అదుర్స్. ట్వంటీస్‌లో ఉన్న బ్యూటీస్ కి పోటీ ఇస్తున్నారు. అదేంటో కానీ, ఈ మధ్య ఈ భామలిద్దరూ ఫోటోల విషయంలో పోటీ పడుతున్నారు.

ప్రతి రెండు రోజులకోసారి ఈ అందాల భామలు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త కొత్త ఫోటోసూట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఈ ట్రిక్స్ అని ఒక మాట ఉంది. సమంత ఈ మధ్య ఎవ్రీడే ఒక ఫోటో షేర్ చేస్తోంది.

మొత్తమ్మీద ఇన్‌స్టాగ్రామ్‌లో కుర్రాళ్లకి ఫుల్లుగా టైమ్‌పాస్‌ అవుతోంది.