క‌ల‌క‌లం రేపిన స‌మంత ఫోటో

Samantha's cleavage pic hurts Akkineni fans
Wednesday, February 27, 2019 - 00:15

స‌మంత నేటి త‌రం న‌టి. ఆమె ఆలోచ‌న‌లు కూడా చాలా మాడ్ర‌న్‌గా ఉంటాయి. పెళ్ల‌యిన త‌ర్వాత కూడా ఆమె న‌టిగా బిజీగా మారింది. పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చింది. ఐతే పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా న‌టన‌ని కంటిన్యూ చేసిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. స‌మంత మొద‌టి భామ ఏమీ కాదు. ఐతే సాధారణంగా పెళ్లి త‌ర్వాత హీరోయిన్లు  గ్లామ‌ర్‌ని ఒల‌క‌బోయారు. సంప్ర‌దాయంగా క‌నిపించేందుకు ఇష్ట‌ప‌డుతారు. 

ఐతే ఇంత‌కుముందే చెప్పుకున్న‌ట్లు స‌మంత అక్కినేని మాడ్ర‌న్ థింకింగ్ ఉన్న యువ‌తి. ఆమె ఇవ‌న్నీ ప‌ట్టించుకోదు. అందుకే త‌న‌దైన శైలిలో ఇప్ప‌టికీ అందాల‌ను ఆర‌బోస్తోంది. తాజాగా ఒక ఫోటోసూట్ కోసం మొత్తం క్లీవేజ్ చూపించ‌డంతో అక్కినేని అభిమానులు హ‌ర్ట్ అయ్యారు. మ‌రీ ఇంత బోల్డ్ ఇప్పుడు అవ‌స‌ర‌మా అంటూ వారు సోష‌ల్ మీడియాలో ఆమెకి కామెంట్స్ పెడుతున్నారు. 

స‌మంత ప్ర‌స్తుతం "బేబీ" అనే సినిమాలో న‌టిస్తోంది. అలాగే భ‌ర్త చైత‌న్య హీరోగా న‌టించిన "మ‌జిలీ" సినిమాలోనూ ఆమె క‌థానాయిక‌.