సమీరారెడ్డి ధుమ ధుమ‌!

Sameera Reddy retort to trolls
Tuesday, March 12, 2019 - 13:45

"మీ అమ్మ కూడా హాట్‌గానే ఉందా," అంటూ త‌న‌ని ట్రోల్ చేస్తున్న‌వారికి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ క్వీన్ స‌మీరారెడ్డి. ఆమె ఇపుడు మ‌రోసారి త‌ల్లి కాబోతోంది. ఐతే తాజాగా త‌న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన కొంద‌రు అభిమానులు ఆమె శ‌రీరాకృతి గురించి చీప్‌గా కామెంట్ చేశారు. బాగా లావు అయిపోయావు. నువ్వు ఒక‌పుడు హీరోయిన్‌వి అంటే న‌మ్మ‌లేకుండా ఉన్నామంటూ కొంద‌రు హేళ‌న చేశారు.

దాంతో ఆమె గ‌ట్టిగా క్లాస్ పీకింది."మీకో ప్రశ్న. మీరు పుట్టిన తర్వాత కూడా మీ అమ్మ హాట్‌గానే ఉందా?," అంటూ రిటార్ట్ ఇచ్చింది స‌మీర‌.

‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్‌’, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ వంటి సినిమాల్లో న‌టించిన స‌మీర ఇపుడు సినిమాల‌కి దూరంగా ఉంటుంది.  

"ఇప్పుడు నేను మళ్లీ తల్లిని కాబోతున్నాను. లావు తగ్గడానికి మరింత సమయం పట్టొచ్చు. అంద‌రి శ‌రీర ధ‌ర్మాలు ఒకేతీరుగా ఉండ‌వు. క‌రీన‌లాంటివారు త‌ల్లి అయిన త‌ర్వాత కూడా అందంగా క‌నిపిస్తారు. అంద‌రూ క‌రీనాలు కాలేరు క‌దా. మీకు ఇలా పిచ్చి పిచ్చిగా వాగే స‌త్తా మాత్ర‌మే ఉంటుంది. నాకు చాలా శక్తి ఉంది. నేను ఓ బిడ్డకు జన్మనివ్వగలను," అంటూ రిప్ల‌యి ఇచ్చింది.