గ‌ర్భ‌వ‌తి స‌మీర..అండ‌ర్‌వాటర్ షూట్‌

Sameerar baby bump show in this underwater photoshoot.
Thursday, July 4, 2019 - 15:15

ఒక‌పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌....బ‌య‌టికి వ‌చ్చేందుకు ఇష్టం చూపేవారు కాదు. ఇపుడు ఆరోగ్య‌రీత్యా...వీలైనంత వ‌ర‌కు వ‌ర్క్ చేయ‌మంటున్నారు డాక్ట‌ర్లు. ఇక హాలీవుడ్ తార‌లు గ‌ర్భం దాల్చిన త‌ర్వాత త‌మ నెల‌ల క‌డుపుతో ఫోటోసూట్‌లు చేసి మేగ‌జైన్‌లకి ఇచ్చే ట్రెండ్ మొద‌లుపెట్టారు. ఇపుడు అది పీక్‌కి చేరింది ఇండియాలో.

ఒక‌పుడు ఎన్టీఆర్‌తో, మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసిన స‌మీరారెడ్డి ప్రెగ్నెంట్ ఫోటోసూట్‌ల‌లో అతిని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఆమె ఇపుడు రెండోసారి తల్లి కాబోతోంది. కొన్ని రోజులుగా త‌న ప్రెగ్నెన్సీ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేస్తూ ట్రోలింగ్‌కి గుర‌వుతోంది. ఐతే ట్రాల‌ర్స్‌ని మ‌రింత‌గా రెచ్చ‌గొడుతూ ఆమె ఇపుడు ఏకంగా అండ‌ర్‌వాట‌ర్ పోటోసూట్ చేసింది. 

తెలుగులో ఎన్టీఆర్ స‌ర‌స‌న "న‌ర‌సింహుడు", "అశోక్" సినిమాల్లో జ‌త‌క‌ట్టింది. మెగాస్టార్ చిరంజీవితో "జై చిరంజీవా"లో న‌టించింది. సూర్య‌తో "సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌"లోనూ మెరిసింది. 38 ఏళ్ల స‌మీరారెడ్డి 2014లో అశోక్ వ‌ర్దే అనే ముంబై బిజినెస్‌మేన్‌ని పెళ్లాడింది. 2015లో ఒక అబ్బాయికి జ‌న్మ‌నిచ్చింది.