సంపూ పెద్ద తోపు!

Sampoo's 3 minute single cut dialogue
Tuesday, July 30, 2019 - 10:15

కామెడీ యాక్ట‌ర్ అని సంపూర్ణేషు బాబుని తేలిగ్గా తీసిపారెయ్య‌కండి. గురుడులో మంచి విష‌యం ఉంది. సంపూ నిజంగానే పెద్ద తోపు అనిపించుకున్నాడు. సంపూ న‌టించిన కొత్త చిత్రం.."కొబ్బ‌రి మ‌ట్ట‌". ఇది కూడా స్ఫూపే. అంటే గ‌తంలోవ‌చ్చిన తెలుగు మాస్ సినిమాల‌పై సెటైరిక‌ల్‌గా సాగే మూవీ. ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుంది.

ఈ సినిమాలో మూడు నిమిషాల పాటు క‌ట్ లేకుండా సాగే లెంగ్తీ డైలాగ్‌ని చెప్పాడు సంపూ. గుక్క‌తిప్పుకోకుండా చెప్పిన ఈ డైలాగ్‌కి సోష‌ల్ మీడియాలో మంచి లైకులు ప‌డుతున్నాయి. సంపూలో వెరైటీ లేదు అని విమ‌ర్శించే వారికి ఇది స‌మాధానం అనే కామెంట్లు కూడా వ‌స్తున్నాయి. ఐతే సంపూ కేవ‌లం హీరో పాత్ర‌ల‌కే ఫిక్స్ కాకుండా మంచి క‌మెడియ‌న్ రోల్స్ చేసుకుంటే బెట‌ర్‌.. అపుడే టాలెంట్‌కి గుర్తింపు వ‌స్తుంది. డ‌బ్బులు కూడా బాగా సంపాదించుకోగ‌ల‌డు.