మ‌హేష్‌తో మూవీ...సందీప్‌కి ఆస‌క్తి లేదా?

Sandeep Vanga and Mahesh Babu's movie, What's the status?
Tuesday, June 25, 2019 - 15:30

"అర్జున్‌రెడ్డి" సినిమా విడుద‌లైన వెంట‌నే ద‌ర్శ‌కుడు సందీప్ వంగాని ఇంటికి పిలిచి అభినందించాడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. రామ్‌చ‌ర‌ణ్ సందీప్‌కి ప్ర‌త్యేకంగా పార్టీ కూడా ఇచ్చాడు. ఐతే మ‌హేష్‌బాబు ఒక అడుగు ముందుకు వేసి...మంచి స్క్రిప్ట్‌తో వ‌స్తే వెంట‌నే మూవీ చేస్తా అని ప్రామిస్ చేశాడు. ఆ టైమ్‌లో ఒక క‌థ‌ని రెడీ చేసుకున్నాడు సందీప్ వంగా. షుగ‌ర్ పేరుతో ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్ లైన్ వినిపించాడు సందీప్‌. ఐతే... మ‌హేష్‌బాబు త‌న ఇమేజ్‌కి ఇది మ‌రీ వైల్డ్‌గా ఉంద‌ని చెప్పాడు. దాంతో మ‌రో క‌థ ఆలోచిద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న టైమ్‌లో సందీప్‌కి బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది.

అర్జున్‌రెడ్డి సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌మ‌ని హిందీ నిర్మాత‌లు కోరడంతో అటు వెళ్లాడు. అర్జున్‌రెడ్డి రీమేక్ విడుద‌లైన త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్‌బాబుకి క‌థ చెప్పి సినిమా మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో మొన్నటి వ‌ర‌కు ఉన్నాడు. ఐతే ఇపుడు సీన్ మారింది.

మ‌హేష్‌బాబుతో వెంట‌నే సినిమా చేయాల్సిన అవ‌స‌రం కూడా సందీప్‌కి లేదు. అత‌ని స్టార్‌డమ్‌, రేంజ్ మారిపోయాయి. క‌బీర్ సింగ్ పేరుతో అర్జున్‌రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేశాడు సందీప్‌. ఆ సినిమా ఇపుడు బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఊపేస్తోంది. ఇప్ప‌టికే 100 కోట్ల క్ల‌బ్బులో చేరింది. 200 కోట్ల మార్క్‌ని అందుకుంటుంద‌ని అంచ‌నా. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిని బాలీవుడ్ ఎందుకు వ‌దులుకుంటుంది. టెంప్టింగ్ ఆఫ‌ర్లు రావ‌డం గ్యారెంటీ.

మ‌రి సందీప్ ఈ గ‌ట్టున ఉంటాడా ఆ గ‌ట్టుకే ఫిక్స్ అవుతాడా?