అమ్మ మొగుడి కథ చేస్తున్న సందీప్

Sandeep Vanga preparing bold script for his next
Friday, July 12, 2019 - 23:30

తెలుగు సినిమా ఫిల్మ్ నగర్ వీధుల్లో ఎక్కువగా ఒక మాట వినిపిస్తుంటుంది. దాని అమ్మ మొగుడి కథ రెడీ చేస్తున్నామని మేకర్స్ అంటారు. దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో కానీ.....ఫలానాదాన్ని తలదాన్నే విధంగా రెడీ చేస్తామని అర్థం. ఇపుడు సందీప్ వంగా కూడా అదే అంటున్నాడు. "అర్జున్ రెడ్డి" రీమేక్‌గా బాలీవుడ్ లో "కబీర్ సింగ్" సినిమాని తీశాడు సందీప్ వంగా. ఆల్టైమ్ అతిపెద్ద బాలీవుడ్ హిట్స్ ల‌లో ఒకటిగా నిలిచింది "కబీర్ సింగ్,"

ఐతే క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాని ఒక చెత్త మూవీగా, పురుషాధిక్యతని నిలబెట్టే కథగా తిడుతూ పోస్ట్ చేశారు. ఈ విమర్శలకి రెచ్చిపోయిన సందీప్ వంగా .... ఈ కథకే ఇంత ఇదైపోయిన క్రిటిక్స్ కి ఒక చాలెంజ్ విసురుతున్నాను అంటూ రెస్పాండ్ అయ్యాడు. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడులాంటి కథని ఇపుడు రెడీ చేస్తున్నాను. అది చూసిన తర్వాత ఈ బాలీవుడ్ క్రిటిక్స్ సొమ్మసిల్లి పడిపోవడం గ్యారెంటీ అంటున్నాడు.

సందీప్ వంగా నెక్స్ట్ మూవీ.....క్రైమ్ క‌థ. అది కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంద‌ట‌.