సప్తగిరి హీరోగా వజ్ర కవచధర గోవింద

Saptagiri's film titled Vajra Kavachadhara Govinda
Wednesday, January 2, 2019 - 14:30

స‌ప్త‌గిరి కొంత‌కాలం క్రితం క‌మెడియ‌న్‌గా ఓ రేంజ్‌లో వెలిగాడు. ఐతే హీరో క్రేజ్ పట్టుకున్న త‌ర్వాత స‌ప్త‌గిరికి కామెడీ వేషాలు త‌గ్గాయి. హీరోగా కూడా పెద్ద‌గా రాణించింది లేదు. ఐనా హీరోగానే తన కెరియ‌ర్‌ని కంటిన్యూ చేస్తున్నాడు ఈ తిరుప‌తి నాయ‌కుడు.

ఇప్ప‌టికే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' వంటి చిత్రాలతో హీరోగా న‌టించిన ఈ క‌మెడియ‌న్ తాజాగా  ‘వజ్ర కవచధర గోవింద’ అనే మూవీని చేస్తున్నాడు.    అరుణ్ పవార్ డైరెక్షన్‌లో శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఇందులో సప్తగిరి పాత్ర పేరు గోవిందు. ఇతనొక ఫన్నీ దొంగ. ఇతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు కూడా ఇందులో బాగా కుదిరాయి. సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది'' అని చెప్పారు ద‌ర్శ‌కుడు.

టైటిల్ సౌండింగ్ బాగానే ఉంది కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సౌండ్ చేస్తుందా అనేది చూడాలి.