సారా వైపే మొగ్గు?

Sara Ali Khan top contender for Mahesh's next
Monday, April 20, 2020 - 13:15

మహేష్ బాబు కొత్త సినిమాని మే 31న అధికారికంగా లాంచ్ చెయ్యడమో, ప్రకటించడమో జరుగుతుంది. తన తండ్రి కృష్ణ బర్త్ డేనాడు తన సినిమాకి సంబంధించి ఎదో ఒకటి చెయ్యడం మహేష్ బాబుకి అలవాటు. సో.. ఈసారి ఇలా.

మహేష్ బాబు ఇప్పటికే దర్శకుడు పరశురామ్ చెప్పిన కథకి ఓకే చెప్పేశారు. ఈ కొత్త మూవీలో హీరోయిన్ ఎవరు? బాలీవుడ్ లో ఇప్పుడు కుర్రాళ్ళని ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కూతురు) వైపు మొగ్గు కనిపిస్తోంది. మహేష్ బాబు భార్య నమ్రత ఇప్పటికే సారాతో మాట్లాడినట్లు సమాచారం. ఐతే, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఆమె డేట్స్ ఎప్పుడు కావాలి అనే దాన్ని బట్టి ఈ అమ్మడు ఫిక్స్ అవుతుందా లేదా అనేది తేలుతుంది. 

మహేష్ బాబు రీసెంట్ గా ఏ హీరోయిన్ ని రిపీట్ చెయ్యడం లేదు. 'స్పైడర్' లో రకుల్, 'భరత్ అనే నేను'లో కియారా అద్వానీ, 'మహర్షి'లో పూజ హెగ్డే, 'సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక మందాన నటించారు. 'బ్రహ్మోత్సవం' తర్వాత హీరోయిన్లని రిపీట్ చెయ్యడం మానేసినట్లు కనిపిస్తోంది.