దీపావళికి మహేష్ ట్రీట్ ఉందిగా

Sarileru Neekevvaru brand new still on Deepavali
Monday, October 21, 2019 - 15:15

'ఆల వైకుంఠపురంలో' టీం ప్రమోషన్ లో దూకుడు చూపుతోంది. మరి 'సరిలేరు నీకెవ్వరు' టీం సైలెంట్గా ఉంటే ఎలా? ఇదే క్వశ్చన్ వేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అందుకే.. ఫ్యాన్స్ కోసం ఈ దీపావళి పండుగ నాడు ఒక సరికొత్త పోస్టర్ ని, మహేష్ బాబు బ్రాండ్ న్యూ లుక్ తో కూడిన స్టిల్ ని రిలీజ్ చేస్తారట. అభిమానులు ఇక పండుగ చేసుకోవాలిసిందే. 

ఈ సినిమాకి సంబందించిన పాటలు  మాత్రం ఇప్పుడిప్పుడే వచ్చేలా లేవు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరుస్తున్న ఈ సాంగ్స్ ని రిలీజ్ కి ఒక నెల రోజుల ముందు నుంచి వదిలేలా ఎదో ఓ స్కీం ప్లాన్ చేశారట. 

అన్నట్లు, మరో నెల రోజుల గ్యాప్ లో సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారట. ఆ రేంజ్ లో ఉంది దర్శకుడు అనిల్ రావిపూడి ప్లానింగ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రానుంది.