గ్రూప్ ఫొటో అదిరిందిగా!

Sarileru team's group photo in Kerala
Saturday, November 9, 2019 - 14:00

సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచి ఏదో ఒక ఎలిమెంట్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాకు ప్రచారం చేస్తూనే ఉన్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ ప్రమోషన్ చూసి ఒక దశలో, బన్నీ-త్రివిక్రమ్ టీమ్ పై విమర్శలు కూడా చెలరేగాయి. అలా ప్రమోషన్ లో దూసుకుపోతున్న రావిపూడి, తాజాగా ఓ గ్రూప్ ఫొటో రిలీజ్ చేశాడు.

సినిమాకు చెందిన కీలకమైన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఉన్నారు ఈ ఫొటోలో. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కేరళలో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఈ సందర్భంగా యూనిట్ అంతా కలిసి ఇలా గ్రూప్ ఫొటో దిగింది. హీరో మహేష్, హీరోయిన్ రష్మికతో పాటు కీలక పాత్రధారులైన రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రఘుబాబు లాంటి నటులంతా ఉన్నారు.

ఈ స్టిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాడు దర్శకుడు. అయితే ఈ ఫొటోలో ఓ వెలితి మాత్రం కనిపిస్తోంది. నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు.. ఇలా అంతా ఉన్నప్పటికీ.. ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న మరో కీలక పాత్రధారి బండ్ల గణేష్ లేకపోవడం మాత్రం ఈ గ్రూప్ ఫొటోలో వెలితిగా మిగిలిపోయింది. ఈ ఒక్క విషయాన్ని మినహాయిస్తే.. పిక్చర్ పెర్ ఫెక్ట్ అనేలా ఉంది ఈ గ్రూప్ ఫొటో.