పక్కన భర్త ఉన్నా రొమాన్స్‌ తప్పలేదు!

Sayyesha talks about Bandobast
Saturday, September 14, 2019 - 16:45

బందోబస్త్ సినిమాలో సూర్య సరసన సాయేషా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సాయేషాతో కలిసి నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానంటున్నాడు సూర్య. ఎందుకంటే పక్కనే ఆర్య కూడా ఉండేవాడట. దీనికి కారణం నిజజీవితంలో సాయేషా భర్త ఆర్య కావడమే. అయినప్పటికీ తప్పలేదని, ఆర్య పక్కనే ఉన్నప్పటికీ సాయేషాతో రొమాన్స్ చేశానని చెప్పుకొచ్చాడు.

"ఈసారి మాత్రం రొమాన్స్ నాకు చాలా కష్టమైంది. ప్రతి సినిమాలో బాగానే చేసేవాడిని. ఈ సినిమాకు వచ్చేసరికి మాత్రం ఆర్యతో చిక్కొచ్చిపడింది. సినిమాలో సాయేషాతో నాకు 2 రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఆ రెండు సన్నివేశాల్లో పక్కన ఆర్య కూడా ఉండేవాడు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను."

అయినప్పటికీ అంతా నటనలో భాగం కాబట్టి రొమాంటిక్ సీన్స్ లో నటించామని, సాయేషా బాగా కోపరేట్ చేసిందని అంటున్నాడు సూర్య. సాయేషా చాలా హార్డ్ వర్కర్ అంటున్నాడు సూర్య. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని, కేవలం పాటల కోసం సాయేషాను తీసుకోలేదని, ఆమె పాత్రకు చాలా స్కోప్ ఉందంటున్నాడు.