సెట్స్‌లో క‌మ్ముల బ‌ర్త్‌డే

Sekhar Kammula birthday celebrations on movie sets
Monday, February 4, 2019 - 18:30

యువ‌త‌లో ఎంతో క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. సెన్సిబుల్ మూవీస్ తీసే శేఖ‌ర్ క‌మ్ముల‌..ఫిదా విడుద‌లైన ఏడాదిన్న‌ర త‌ర్వాత కొత్త సినిమాని మొద‌ల‌పెట్టాడు. ఈ సారి కొత్త జంట‌తో సినిమా తీస్తున్నాడు. ఆ కొంత జంట పేర్ల‌ని ఇంత వ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు. రిలీజ్‌కి ముందే వారిని మీడియా ముందుకు తెస్తాడ‌ట‌. ఈ సినిమాతో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ ఏషియ‌న్ సునీల్ నిర్మాత‌గా మారుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వాళ్ల బ్యాన‌ర్ ఇన్‌డైర‌క్ట్‌గా ప్రొడ‌క్ష‌న్‌ల‌లో పాల్గొంది.

ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో ఏషియన్ గ్రూప్ నిర్మిస్తోంది ఈ మూవీని. ఈ మూవీ లొకేషన్ లోనే ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 4) శేఖ‌ర్ క‌మ్ముల పుట్టిన రోజు వేడుకలు జ‌రిగాయి. నిర్మాతలు..శేఖర్ కమ్ముల తో కేక్ కట్ చేయించారు.

ఈ వేడుక లో నిర్మాతలు సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లతో పాటు ఏషియన్ గ్రూప్ పార్టనర్ సదానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, ఎగ్జిబిటర్ శ్రీధర్, సినిమాటోగ్రాఫర్ విజయ్.సి.కుమార్, మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.