సీనియ‌ర్ న‌టుడి అతి ప్ర‌వ‌ర్త‌న‌!

Senior actor's over action
Friday, January 25, 2019 - 16:15

ఆ సీనియ‌ర్ న‌టుడు..న‌ట‌న‌లో ఇర‌గ‌దీస్తాడు. హాస్యం పండించ‌డంలో "కింగ్". ఆయ‌న న‌ట‌న‌ని ఎవ‌రూ వంక‌పెట్టరు. ప్ర‌స్తుతం తండ్రి, అంకుల్ పాత్ర‌లు పోషిస్తున్న ఈ మాజీ హీరో రీసెంట్‌గా అన్నింట్లోనూ వేలు పెట్టి ద‌ర్శ‌కుల‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాడ‌ట‌. ద‌ర్శ‌కులు చెప్పేదాన్ని ప‌ట్టించుకోకుండా.. తాను ఏం అనుకుంటే అది చేయ‌డం, స‌హ న‌టుల‌కి కూడా త‌నే ఇలా చేయాలంటూ డైర‌క్ష‌న్ చేస్తున్నాడ‌ట‌.

ఆయ‌న ఓవ‌ర్ ఇన్‌వాల్వ్‌మెంట్‌ని చూసి చాలా మందికి మండుతున్నా.. ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ని చూసి జంకుతున్నార‌ట‌. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా సెట్‌లో ఆయ‌న ప్ర‌వ‌ర్తించిన తీరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సెట్‌లో అగ్ర హీరోయిన్ ఉంది. ద‌ర్శ‌కురాలు సీన్ చెపుతోంది. కానీ ఆయ‌న క‌ల‌గ‌చేసుకొని ఆ అగ్ర హీరోయిన్‌కి త‌నే ఇలా చేయాలంటూ చెప్పాడ‌ట‌. సీన్ మ‌ధ్య‌లో త‌నే క‌ట్ చెప్పి ఆ క‌థానాయ‌క‌కి ఇలా చేస్తే బెట‌ర్ అని స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. ఆ సీనియ‌ర్ న‌టుడి అతికి ఆ అగ్ర క‌థానాయిక కూడా ఇరిటేట్ అయింద‌ట‌.

ఏదో స‌ర్ది చెప్ప‌బోతుంటే.. ఆ ద‌ర్శ‌కురాల‌పై కూడా నోరు జారాడ‌ట‌. ఇదీ ఆయ‌న వ‌రుస‌.