అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హీరో

Senior star recovering from prolonged illness
Friday, March 13, 2020 - 13:15

అతడో సీనియర్ హీరో. చాన్నాళ్లుగా వాయిదాపడుతున్న అతడి సినిమా కూడా ఒకటి థియేటర్లలోకొచ్చింది. అయితే ఆ సినిమా ప్రచారానికి మాత్రం అతడు రాలేదు. అంతేకాదు, కొన్ని రోజులుగా ఆయన పబ్లిస్ డొమైన్ లో కనిపించలేదు కూడా. దీనికి కారణం అతడు తీవ్రంగా అనారోగ్యానికి గురవ్వడమే. అయితే ప్రస్తుతానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకున్న టైమ్ లో హిట్ కొట్టి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన ఆ సీనియర్, ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమధ్య ఓ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ అంతలోనే ఆపేశారు. ఆనారోగ్య కారణాల వల్లనే ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ నటుడు తప్పుకున్నాడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే అదే నిజమని ఇండస్ట్రీకి అర్థమైంది.

ప్రస్తుతానికైతే ఆ హీరో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. నలుగురితో కలుస్తున్నారు. రేపోమాపో కథాచర్చలు కూడా ప్రారంభించి, మరో సినిమా ఎనౌన్స్ చేసేంత ఆరోగ్యంగా కూడా ఉన్నారు. కాకపోతే ఆ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటనే విషయాన్ని మాత్రం ఆయన కుటుంబ సభ్యులు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఏదేమైనా ఆయన కోలుకున్నారు. అందరికీ అదే ఆనందం.