నందిత శ్వేతతో ష‌క‌ల‌క‌!

Shakalaka joins Akshara team
Wednesday, February 20, 2019 - 15:00

నందిత శ్వేత హీరోయిన్‌గా రూపొందుతోన్న ఇంట్రెస్టింగ్ మూవీ..అక్ష‌ర‌. ఈ సినిమా ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. తాజాగా ఈ సినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ పాల్గొంటున్నారు. వీరి కామెడీ, వీరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయిట‌.

 ‘‘అక్షర" సినిమాని  మే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది టీమ్. వేసవిలో వచ్చే అన్ని చిత్రాలతో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూనే ఓ ప్రత్యేమైన అనుభూతిని ఇచ్చేలా తమ చిత్రం నిలుస్తుందని బలంగా నమ్ముతోంది ‘‘అక్షర’’ టీమ్‌

టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రానికి నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ‌.
 బి. చిన్నికృష్ణ డైర‌క్ట్ చేస్తున్నారు.