శ‌ర్వానంద్‌కి కూడా షూటింగ్‌లో గాయాలు

Sharwanand too gets injured in Thailand
Sunday, June 16, 2019 - 10:30

శ‌ర్వానంద్‌కి కూడా షూటింగ్‌లో గాయాలు
ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌
ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌
గ్యాంగ్‌లీడ‌ర్ లొకేష‌న్‌లో నాని
వైజాగ్ షూటింగ్‌లో నాగ‌శౌర్య‌
క‌ర్నూల్‌లో తెనాలి రామ‌కృష్ణ షూటింగ్‌లో సందీప్‌కిష‌న్‌

వీరంతా రీసెంట్‌గా గాయ‌ప‌డ్డ టాలీవుడ్ స్టార్స్‌. ఇపుడు శ‌ర్వానంద్‌.

"96" రీమేక్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన శ‌ర్వానంద్‌..ఆ షూటింగ్ లొకేష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. 96 రీమేక్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన శ‌ర్వానంద్‌..ఆ షూటింగ్ లొకేష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న 96 రీమేక్ కోసం ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో శ‌ర్వా నంద్ ప రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్ల‌పై ల్యాండ్ కావాల్సిన వ్య‌క్తి భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యారు. ఆ కార‌ణంగా షోల్డ‌ర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయ్యింది. 

ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. శ‌ర్వాను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు భుజానికి బ‌ల‌మైన గాయం త‌గ‌లింద‌ని, కాబ‌ట్టి శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని సూచించారు. సోమ‌వారం ఈ శ‌స్ర‌చికిత్స జ‌రగ‌నుంది. స‌ర్జ‌రీ త‌ర్వాత క‌నీసం నాలుగు రోజులు హాస్పిట‌ల్‌లోనే ఉండాల‌ని డాక్ట‌ర్స్ శ‌ర్వాకు సూచించారు.