"నాగబాబు పిల్లికి బిచ్చం పెట్టడు"

Shivaji Raja blasts on Naga Babu
Sunday, April 7, 2019 - 22:30

నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు శివాజీరాజా. నాగబాబుని ఓడించాలని నర్సాపురం ప్రజలని కోరుతున్నాడు. ఆరు వందలకు పైగా మెంబెర్స్ ఉన్న మా అసోసియేషన్ కే నాగబాబు ఏమి చెయ్యలేదు నర్సాపురం కి ఏమి చేస్తాడని శివాజీరాజా అన్నారు.

"చిరంజీవి గారు నాకు 30 ఏళ్ల నుంచీ నాకు తెలుసు. ఆయన మా లాంటి వారందరికీ ఆదర్శం. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఆయన్ని మేము దేవుడు లాగా కొలుస్తాము. పవన్ కళ్యాణ్ అన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయనలో ఒక విజన్ ఉంది, ఒక డేర్ ఉంది. వీరిద్దరి మధ్య పుట్టిన నాగబాబుకి ఏ విజన్ లేదు. ఏ రకంగాను ఆదర్శంగా తీసుకోడానికి పనికిరాడు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అతను అలా కాదు. ఏ రకంగా నర్సాపురం వెళ్లి ఓట్లు అడుగుతాడు, "అని ధ్వజమెత్తారు. 

"నువ్వు ఎవరినైతే నా వాళ్ళు అని గెలిపించావో ఈ రోజు వాళ్ళు నిన్ను , నీ పార్టీని ఏమంటున్నారు. 30 ఏళ్ళ నుంచి మెగాస్టార్ని మిమ్మల్ని నమ్మిన మేము పరాయి వాళ్ళం అయిపోయామా! 600 మంది ఉన్న మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే  మా అసోసియేషన్ కు ఏమి చెయ్యలేదు. లక్షలాది ప్రజాలున్న నర్సాపురానికి ఏమి చేస్తావు. ఏనాడైనా నర్సాపురం వెళ్ళారా కనీసం దాని బోర్డర్స్ తెలుసా. పిల్లి కి బిచ్చమ్ కూడా పెట్టని నువ్వు ఏ విధంగా అక్కడికి వెళ్లి ప్రజల్ని ఓట్ వేయమని అడుగుతున్నావు అని మండిపడ్డారు శివాజీరాజా.