నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ పక్కా!

Shivaji Raja vows to take revenge on Naga Babu
Tuesday, March 19, 2019 - 16:00

టాలీవుడ్‌లో కూడా రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. తెలంగాణలో కేసీఆర్ ని ఓడించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యా రు. ఐతే మీడియాని ఉపయోగించుకొని తనని చికాకు పర్చిన బాబుకి అదే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. అంటే అంతకంతకి తీర్చుకోవడన్నమాట.

ఇపుడు టాలీవుడ్‌లో కూడా ఇలాంటి రాజకీయమే నడుస్తోంది.

ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీరాజా ఓడిపోయాడు. తన ఓటమికి కారణం.... నాగబాబు ప్లేట్ ఫిరాయించడమే అని ఆరోపిస్తున్నాడు శివాజీరాజా. తనకి మద్దతు ఇవ్వాల్సిన నాగబాబు చివరి నిమిషంలో నరేష్‌కే నా ఓటు అంటూ సందేశం ఇవ్వడంతో శివాజీరాజాకి మండింది.

నాగబాబు చేసిన మోసానికి రిటర్న్ గిఫ్ట్ పక్కాగా ఇస్తానని శపథం చేశాడు శివాజీరాజా.