చెల్లిది ఐపోయింది, అక్క‌ది ఆగింది

Shivani Rajasekhar film scrapped
Friday, May 3, 2019 - 16:45

రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల కూతుళ్లు ఇద్ద‌రూ సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. పెద్ద కూతురు శివానీ గ‌తేడాదే హీరోయిన్‌గా సినిమా మొద‌లుపెట్టింది. సినిమాకి క్లాప్ ప‌డిన 14 నెల‌ల త‌ర్వాత కూడా ఆమె సినిమా విడుద‌ల కాలేదు. ఎందుకంటే ఆమె సినిమా అట‌కెక్కింద‌ట‌.

గూఢ‌చారి హీరో అడివిశేషు, శివానీ జంట‌గా బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్ట‌యిన "2 స్టేట్స్" రీమేక్‌ని గ‌తేడాది మార్చిలో అట్ట‌హాసంగా ప్రారంభించారు. కానీ కొత్త ద‌ర్శకుడు వెంక‌ట్ తీసిన విధానం అడివి శేషుకి న‌చ్చ‌లేద‌ట‌. దాంతో అత‌ను రిపేర్లు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. సో..ఇపుడు ఆ సినిమాని మొత్తంగా ప‌క్క‌న పెట్టారు. మ‌రో ద‌ర్శ‌కుడిని తీసుకొని మ‌ళ్లీ తీస్తారేమో చూడాలి. ఏదీ ఏమైనా అక్క శివానీ సినిమా ఆగిపోయింది. చెల్లి మాత్రం తొలి సినిమా షూటింగ్‌కి గుమ్మ‌డికాయ కొట్టింది.

రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక ఇటీవ‌లే హీరోయిన్‌గా "దొర‌సాని" అనే సినిమా ప్రారంభించింది. ఈ సినిమా ద్వారా విజయ్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి విడుద‌ల‌కి రెడీగా ఉంది.