వెబ్ సిరీస్ అంటే విప్పాల్సిందేనా!

Should heroines must expose in web series?
Monday, December 30, 2019 - 14:15

వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. తెలుగులో కూడా చిన్న హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించేందుకు పోటీ పడుతున్నారు. సమంత లాంటి పెద్ద హీరోయినే 'ది ఫామిలీ మెన్* రెండో సీజన్లో నటిస్తోంది. ఇక శ్రద్ధ దాస్, ఈషా రెబ్బ, తేజస్వి వంటి చిన్న హీరోయిన్లు వరుసగా వెబ్ సిరీస్ లు సైన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అయితే దాదాపుగా అందరూ వీటిని సైన్ చేస్తున్నారు. అయితే, హీరోయిన్లు అందరూ కిస్ లు, ఎక్సపోజింగ్ విషయంలో రెచ్చిపోతున్నారు. 

వెబ్ సిరీస్ లు ఎక్కువ శాతం అడల్ట్ కంటెంట్ తో రూపొందుతున్నాయి. బూతు డైలాగులు, అందాల ఆరబోత విషయంలో సెన్సార్ లేదు. దాంతో అందరూ విప్పేస్తున్నారు. వెబ్ సిరీస్ అంటే విప్పాలిసిందే అని సూత్రం ఫిక్స్ అయినట్లు ఉంది. 

లస్ట్ స్టోరీస్ అనే హిందీ వెబ్ సిరీస్ ని ఇప్పుడు తెలుగులోనూ తీస్తున్నారు. ఇందులో నటిస్తున్న ఈషా రెబ్బ... ఓపెన్ గా చెప్పేస్తోంది.. తన పాత్ర అందరికి షాక్ ఇస్తుందని. ఎక్సపోసింగ్ ఫుల్ గా చేసానని హింట్ ఇస్తోంది.