వేశ్య‌గా శ్ర‌ద్ధాదాస్

Shraddha Das as call girl in Pure Soul
Sunday, April 21, 2019 - 11:00

తెలుగులో ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించిన శ్ర‌ద్దాదాస్ చాలా గ్యాప్ త‌రువాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని క‌ళాత్మ‌క దృష్టి తో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్‌.

ద‌ర్శ‌కుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని తాజాగా హైద‌రాబాద్‌లోని  ప్ర‌సాద్ ల్యాబ్ లో ప్ర‌ద‌ర్శించారు. 

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి దత్తా, ప్ర‌ముఖ నిర్మాత‌లు రామ్ త‌ల్లూరి, ర‌జ‌ని త‌ల్లూరి, రాజ్ కందుకూరి మ‌రియు స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్య‌న్ లు హ‌జ‌ర‌య్యారు. షార్ట్ ఫిల్మ్‌ని చూసిన వారంతా ద‌ర్శ‌కుడిని అభినందించారు. తి ఫ్రేమ్ ని చాలా చక్క‌గా చూపించాడనీ,. టెక్నిక‌ల్ గా అందంగా చూపించాడనీ పొగిడారు.

శ్ర‌ద్దాదాస్ డేరింగ్‌గా నటించినందుకు ఆమెని ప్ర‌శంసించారు.