శ్రద్ధగా యోగాసనాలు!

Shraddha Das yogasans
Monday, March 23, 2020 - 15:30

దేశమంతా కర్ఫ్యూ పాటిస్తుంటే.. శ్రద్ధాదాస్ అందరికీ యోగాసనాలు నేర్పుతోంది. సెల్ఫ్ క్వారంటైన్ అంటూ కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న శ్రద్ధాదాస్ నిత్యం యోగ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతోంది. ఆమె చేస్తున్నది యోగా అయినప్పటికీ, కుర్రకారు ఎవరూ ఆ యోగాసనం పేరేంటని ఆలోచించడం లేదు, శ్రద్ధా అందాల్ని జుర్రుకునే పనిలో బిజీగా ఉన్నారు.

నిజానికి ఈమధ్య శ్రద్ధా దాస్ నుంచి వచ్చిన ఫొటోలతో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. అవును.. జస్ట్ కొన్ని రోజుల కిందట ఆమె 2-పీస్ బికినీతో అదరగొట్టింది. స్విమ్మింగ్ పూల్ బయట హాట్ హాట్ స్టిల్స్ ఇస్తూ, ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టింది. వాటి నుంచి కుర్రాళ్లు ఇంకా తేరుకోకముందే ఇలా హాట్ యోగా అంటూ మరోసారి పలకరించింది.