బాలిలో శ్రద్ధగా ఎంజాయ్

Shradha Das vacation pics from Bali
Saturday, December 21, 2019 - 18:45

శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో బాగా హడావుడి చేసే ముద్దుగుమ్మే. సిద్ధూ ఫ్రమ్ శికాకుళం అనే సినిమాలో ఓ చిన్న ఆర్టిస్టుగా, సెకెండ్ హీరోయిన్ గా కనిపించిన శ్రద్ధా దాస్ కి ఇప్పుడు తనకంటూ స్పెషల్ గా గుర్తింపు తెచ్చుకొంది.  పెద్ద అవకాశాలు లేవు కానీ గ్లామర్ ను పెర్ ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. 

ఈ బ్యూటీ ఇప్పుడు బాలిలో హంగామా మొదలుపెట్టింది. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు ఓ కొలిక్కి రావడంతో తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ఇండోనేషియాలోని బాలిలో వాలిపోయింది.

అక్కడ కూడా వ్యక్తిగతంగా ఎంజాయ్ చేయాలని అనుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. తను దిగిన రిసార్ట్ నుంచి స్నానం చేసే స్విమ్మింగ్ పూల్ వరకు ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. హాలిడేయింగ్ లో కూడా తన యాక్టివ్ నెస్ వీడలేదు. అదే గ్లామర్, అదే యాక్టివ్ నెస్.