బాల‌య్య మొద‌టి ప్రిఫ‌రెన్స్ ఆమెకేన‌ట‌!

Shriya to pair up with Balakrishna again
Tuesday, June 18, 2019 (All day)

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ రూపొందించ‌నున్న కొత్త సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా లాంచ్ అయింది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. ఈ సినిమాలోనూ ఇద్ద‌రు హీరోయిన్లుంటార‌ట‌. ఒక హీరోయిన్‌గా శ్రియాని తీసుకోనున్నార‌నేది లేటెస్ట్ టాక్‌. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌... ఇంత‌క‌ముందు బాల‌య్యతో తీసిన "జైసింహా" సినిమాలో న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌ని హీరోయిన్లుగా తీసుకున్నాడు. ఈసారి నిర్మాత సీ.క‌ల్యాణ్ స‌ల‌హా ప్ర‌కారం ఒక హీరోయిన్‌గా శ్రియాని తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌.

నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల శ్రియాతో వ‌రుస‌గా రెండు సినిమాలు చేశాడు. "శాత‌క‌ర్ణి"లో ఆమె బాల‌య్య భార్య‌గా నటించింది. ఇక పూరి తీసిన "పైసావ‌సూల్‌"లోనూ ఆమె బాల‌య్య స‌ర‌స‌న జ‌త‌క‌ట్టింది. ఇపుడు మ‌రోసారి ఆమెకే మెయిన్ ఫీమేల్ లీడ్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఐతే మేక‌ర్స్ మాత్రం ఇంత‌వ‌ర‌కు అధికారికంగా ఎవ‌రి పేరు ప్ర‌క‌టించ‌లేదు.

శ్రియాకి రీసెంట్‌గా అవ‌కాశాలు బాగా త‌గ్గాయి. దాంతో ఆమె త‌న భ‌ర్త‌తో ఫారిన్ ట్రిప్పులేస్తోంది. ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం అప్‌డేట్ చేస్తోంది. ర‌ష్యాకి చెందిన వ్యాపార‌వేత్త‌ని ప్రేమించి పెళ్లి చేసుకొంది శ్రియా.