కేక పుట్టిస్తున్న క్వారంటైన్ షో

Shriya Saran's special show
Wednesday, April 29, 2020 - 23:00

అసలే కరోనా కాలం... పైగా ఉన్నది స్పెయిన్ లో..
అయినప్పటికీ శ్రియ మాత్రం తన ఎంజాయ్ మెంట్ ఆపడం లేదు. ఇంట్లో ఉంటూనే.... మరోవైపు అభిమానులను కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు వీడియోలు పెట్టడమే కాకుండా.. తాజాగా తన వివాహ వార్షికోత్సవ అనుభవాల్ని కూడా షేర్ చేసుకుంది. ఇలా డెయిలీ అప్ డేట్స్ ఇస్తున్న శ్రియ.. ఈసారి ఇంకాస్త రెచ్చిపోయింది.

నైట్ డ్రెస్ లో శ్రియ బాల్కనీలో ఉన్నప్పుడు ఆమె భర్త ఆండ్రీ తీసిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ గా ఉన్న ఆ స్టిల్స్ లో శ్రియ అదిరిపోయింది. నిజానికి ఇలాంటి పోజులు శ్రియకు కొత్త కాదు, కానీ ఈ క్వారంటైన్ టైమ్ లో ఈమె నుంచి ఇంత హాట్ పిక్స్ రావడం ఇదే  ఫస్ట్ టైమ్.

చూడండి: శ్రియ ఫోటోలు

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో తమ పిక్స్ రిలీజ్ చేస్తున్నారు. కొందరు పాత ఫొటోషూట్స్ నుంచి కొన్నితీసి బయటకు వదుల్తుంటే.. మరికొందరు సెల్ఫీలు రిలీజ్ చేస్తున్నారు. అయితే శ్రియ అంత హాట్ గా మాత్రం ఎవ్వరూ ఫొటోలు రిలీజ్ చేయడం లేదు.