శ్రియ సెటిల్ అయింది ఎక్కడో తెలుసా?

Shriya settles down in an European country
Thursday, December 26, 2019 - 22:30

శ్రియ ఇండియన్. ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్ రష్యన్. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి కూడా రెండేళ్లు అవుతోంది. సో.. కాపురం పెడితే ఇండియాలో పెట్టాలి, లేదంటే మాస్కోలో ఉండాలి. కానీ శ్రియ ప్రస్తుతం ఈ రెండు దేశాల్లో ఉండడం లేదు. అవును.. భర్తతో కలిసి స్పెయిన్ లో సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.

శ్రియ భర్తకు క్రీడా ఉత్పత్తుల వ్యాపారం ఉంది. రష్యాలో మంచి లీడింగ్ లో ఉన్న బ్రాండ్ అది. ఇండియాలో కూడా ఓ ఔట్ లెట్ తెరిచినట్టున్నారు. ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు స్పెయిన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అండ్రీ. అందుకే ఏకంగా తన మకాంను బార్సిలోనాకు మార్చేశాడు. ప్రస్తుతం శ్రియ అక్కడే ఉంటోంది. ఏవైనా షూటింగ్స్ ఉంటే ఇండియా వస్తుంది, పని పూర్తిచేసుకొని తిరిగి బార్సిలోనా వెళ్లిపోతుంది.

తనకు పెళ్లయి అప్పుడే రెండేళ్లు అయిపోతుందంటే నమ్మలేకపోతున్నానంటోంది శ్రియ. ఈ సందర్భంగా భర్తకు సంబంధించిన ఓ గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. మూడేళ్ల కిందట మాల్దీవులు విహారయాత్రకు వెళ్లినప్పుడు, అక్కడ కృశ్చేవ్ పరిచయం అయ్యాడట. ఇద్దరూ కలిసి సముద్రం అడుగున డైవింగ్ చేశారట. అలా పరిచయమైన కృశ్చేవ్, తక్కువ టైమ్ లోనే చాలా క్లోజ్ అయిపోయాడని, వెంటనే పెళ్లి చేసుకున్నామని అంటోంది శ్రియ.