అవ‌న్నీ అబ‌ద్దాలే: శ‌్రుతి హాస‌న్‌

Shruti Haasan denies rumors
Monday, April 15, 2019 - 14:00

నా పెళ్లి వార్తలు అబద్దం అంటోంది శ్రుతి హాసన్. ఇటలీకి చెందిన మైఖేల్ అనే నటుడితో శ్రుతిహాసన్ కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. గతేడాది అతన్ని తన తండ్రికి పరిచయం చేసింది. అలాగే బంధువులందరికీ అతన్ని చూపించింది. ఆ పెళ్లి వేడుకకి మైఖేల్ పంచెకట్టుకొని రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది/

శ్రుతిహాసన్ పెళ్లి వార్త మళ్లీ లైమ్‌లైట్లోకి వచ్చింది. దానికి తగ్గట్లే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతోంది. కానీ పెళ్లి అనే థాట్ ఇపుడు లేదంటోంది ఈ బ్యూటీ.

రెండేళ్ల క్రితం విడుదలైన "కాటమరాయుడు" సినిమా తర్వాత శ్రుతి హాసన్ మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. తమిళంలోనూ ఆమె ఒక్క సినిమా చేయడం లేదు. హీరోయిన్గా ఆమెకిపుడు పెద్దగా ఆఫర్లు లేవు.