శ్రుతి హాస‌న్ సెంటిమెంట్‌

Shruti Haasan's bad sentiment
Saturday, July 13, 2019 - 15:00

చేతిలో సినిమాల్లేకపోయినా.. నాన్న సినిమా ఉందని మొన్నటివరకు గొప్పగా చెప్పుకునేది శృతిహాసన్. తండ్రి కమల్ హాసన్ తో శభాష్ నాయుడు అనే సినిమాను అప్పుడెప్పుడో జమానాలోనే స్టార్ట్ చేసింది శృతి. అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి ఎప్పుడు అడిగినా ఆ సినిమా గురించే చెప్పేది. ఇప్పుడా అవకాశం లేదు. శభాష్ నాయుడు సినిమాని బిన్‌లో ప‌డేశారు.

అవును.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇది మ‌ళ్లీ రివైవ్ కాదు. ఎందుకైనా మంచిదని.. బ్రహ్మానందంతో చిన్నపాటి సెటిల్ మెంట్ కూడా పూర్తిచేశారట మేకర్స్. సినిమాని పూర్తిగా అట‌కెక్కించారనే విషయం ఈ సెటిల్ మెంట్ ద్వారానే బయటకొచ్చింది. 

ఇంతకీ ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..? డబ్బుల్లేక ఈ సినిమా ఆగిపోలేదట. కేవలం బ్యాడ్ సెంటిమెంట్ వల్ల ఆపేశారట. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాతే కమల్ కు పెద్ద యాక్సిడెంట్ అయింది. శృతిహాసన్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు వచ్చాయట. అందుకే సెంటిమెంట్ కొద్దీ సినిమాను పక్కనపెట్టారట.

ప్రస్తుతానికైతే ఓ తమిళ సినిమా, ఓ హిందీ సినిమా చేస్తోంది శృతిహాసన్. తెలుగులో రవితేజ ప్రాజెక్టు కోసం ఆమెను సంప్రదిస్తున్నారు.