5 నెల‌ల త‌ర్వాత సింగ‌ర్ కార్తీక్ వివ‌ర‌ణ‌

Singer Karthik on Me Too explanation
Tuesday, February 19, 2019 - 18:30

కార్తీక్ గురించి ప‌రిచయం అక్క‌ర్లేదు. నేటి జ‌న‌రేష‌న్‌లో మెలోడి గీతాల‌తో ఎంతో స్టార్‌డ‌మ్ పొందిన గాయ‌కుడు. చెన్నైలో పుట్టి పెరిగిన సింగ‌ర్ అటు త‌మిళంలోనూ, ఇటు తెలుగ‌లోనూ ఎంతో పాపుల‌ర్‌. నాని, నాగార్జున న‌టించిన దేవ‌దాస్ సినిమా విడుద‌ల త‌ర్వాత కార్తీక్‌.. సీన్ నుంచి మాయం అయ్యాడు. దానికి కార‌ణం.. అత‌నిపై మీటూ ఆరోప‌ణ‌లు రావ‌డం. అయిదు నెల‌ల పాటు మౌనం వ‌హించిన కార్తీక్ ఇపుడు మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చాడు. సుదీర్ఘంగా వివ‌ర‌ణ ఇచ్చాడు.

మీటూ ఉద్య‌మాన్ని స‌మ‌ర్ధిస్తున్నాను. కానీ నాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు. నేను ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు. ఎవ‌రితోనూ వారి ఇష్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. పేరు వెల్ల‌డించకుండా సోష‌ల్ మీడియా ద్వారా నాపై ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తికి నేను చెప్పేది ఒక్క‌టే..న‌న్ను డైర‌క్ట్‌గా సంప్ర‌దించి నేను చేసిన త‌ప్పు ఏంటో చెపితే..  క్షమాపణ అడుగుతాను. నా తప్పు ఉంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు కూడా నేను సిద్దంగా ఉన్నాను అని వివ‌ర‌ణ ఇచ్చాడు.

సినిమా పాట‌లు, క‌చేరిలు, కొత్త సినిమాల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తానంటున్నాడు.