మజిలీది ఏ రేంజ్?

Slight drop in collections for Majili
Wednesday, April 10, 2019 - 11:15

"మజిలీ" సినిమాకి కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి మొదటి నాలుగు రోజులు. ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఎవరూ ఊహించలేదు. వేసవి సెలవుల్లో మొదటి సినిమా కావడం, సమంత - చైతన్య కాంబినేషన్ పై సహజంగా జనాల్లో ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకి స్టన్నింగ్ కలెక్షన్లు వచ్చాయి.

మొదటి మూడు రోజుల తర్వాత మండే రోజు ఏ సినిమా అయినా డ్రాప్ అవుతుంది. ఈ విషయంలో "మజిలీ" లక్కీ అనే చెప్పాలి. మండే రోజు ఎక్కువ రేంజ్లో డ్రాప్ రాలేదు. ఐతే మంగళవారం బాగా డ్రాప్ అయింది. బుధవారం కూడా పెద్దగా కోలుకున్నట్లు లేదు. ఐతే మళ్లీ ఈ వీకెండ్ ఈ సినిమా పుంజుకుంటుందని భావిస్తోంది ట్రేడ్.

ఓవరాల్ గాఈ సినిమా ఇప్పటికే హిట్ అనిపించుకొంది. ఐతే రేంజ్ ఏంటనేది వచ్చే వీకెండ్ ఎలా పెర్ ఫార్మ్ చేస్తుందనే విషయంపై ఆధారపడుతుంది. "చిత్రలహరి" సినిమాతో ఈ వీకెండ్ ఈ మూవీ పోటీపడాలి. ఈ  సినిమాతో పోటీపడి ఏ రేంజ్ కలెక్షన్లను రాబట్టుకుంటుందనేది చూడాలి.