విరాట్ తో లింక్ లేదంటున్న హాట్ బ్యూటీ

Sofia Maria Hayat denies affair with Virat Kohli
Monday, January 21, 2019 - 19:00

తనకు, విరాట్ కు మధ్య ఎఫైర్ ఉందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది సోఫియా హయత్. తన పాత ట్వీట్లను ఫొటోషాప్ చేసి పుకార్లు పుట్టిస్తున్నారని, ప్రస్తుతం సోషల్ మీడియాలో తన పేరుపై చక్కర్లు కొడుతున్న ట్వీట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తన ఎకౌంట్ లో ఏకంగా ఓ వీడియోను పోస్ట్ చేసింది సోఫియా.

తనకు విరాట్ కు మధ్య ఎలాంటి ఎపైర్ లేదని ఆ వీడియోలో ఆమె స్పష్టంచేసింది. పనిలోపనిగా అదే వీడియోలో మరో క్రికెటర్ రోహిత్ శర్మపై కూడా స్పందించింది. గతంలో తను, రోహిత్ డేటింగ్ లో పాల్గొన్నామని, కానీ ఆ తర్వాత విడిపోయామని స్పష్టంచేసింది. ఇకనైనా ఈ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అందర్నీ కోరింది.

గతంలో ఓ మ్యాచ్ గెలిచినప్పుడు నగ్నంగా తను, రోహిత్ పండగ చేసుకున్నామంటూ సోఫియా పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో పాటు విరాట్ కోహ్లి పిచ్ పైనే కాదని, బయట కూడా మంచి ఆటగాడంటూ మరో పోస్ట్ కూడా వైరల్ అయింది. ఈ పోస్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదంటోంది సోఫియా.

అనుష్క శర్మను పెళ్లి చేసుకొని విరాట్, రితికా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని రోహిత్ శర్మ ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. దీనికి తోడు ఆస్ట్రేలియా సిరీస్ నెగ్గిన ఆనందం దీనికి తోడైంది. ఇలాంటి టైమ్ లో సోఫియా పేరిట చక్కర్లు కొడుతున్న స్క్రీన్ షాట్స్, మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి.