సోలోగా 10 కోట్లు కొట్టేశాడు

Solo Bratuhuke So Better does great business
Tuesday, March 10, 2020 - 18:15

ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్" అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఈ సినిమా కంటే ముందు అతడికి "చిత్రలహరి", "ప్రతిరోజూ పండగే" రూపంలో రెండు హిట్స్ ఉన్నాయి. దీంతో "సోలో బ్రతుకే సో బెటర్" సినిమాపై అంచనాలు పెరిగాయి. కొత్త దర్శకుడు అయినప్పటికీ సాయితేజ్ జడ్జిమెంట్, అతడి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ జరిగిపోతోంది. ఇందులో భాగంగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ భారీ ఎత్తున జరిగింది.

"సోలో బ్రతుకే సో బెటర్" సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది. ఈ రెండింటి మొత్తం విలువ అక్షరాలా 10 కోట్ల రూపాయలు. శాటిలైట్+డిజిటల్ కింద ఓ సినిమాకు ఇంత మొత్తం పలకడం సాయితేజ్ కెరీర్ లో ఇదే తొలిసారి. ఈ సెగ్మెంట్ లో సాయితేజ్ తన గత రికార్డుల్ని బద్దలుకొట్టాడు.

మరోవైపు థియేట్రికల్ బిజినెస్ లో కూడా "సోలో బ్రతుకే సో బెటర్" దుమ్ముదులుపుతోంది. దాదాపుగా బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమా కూడా హిట్టయితే సాయితేజ్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం.