ఇక హీరోయిన్ ఎంట్రీ ఇలా అన్న‌మాట‌

Special intro scene for Samanth
Saturday, July 6, 2019 - 13:45

ఒక‌పుడు పెద్ద హీరోలకి ఇంట్ర‌డిక్ష‌న్ సీన్ అనే చాలా హంగామా జ‌రుగుతుండేది. గాల్లో నుంచి ఎగిరి ప‌డుతున్న‌ట్లో, హెలికాప్ట‌ర్ దిగుతున్న‌ట్లో, జ‌నం మ‌ధ్య నుంచి న‌డిచి వ‌స్తున్న‌ట్లో, ఏదైనా బిగ్ ఫైట్‌తోనే హీరోల ఇంట్ర‌డిక్ష‌న్ ఉండేది. అలా ఇంట్రడిక్ష‌న్ ఉంటేనే స్టార్ అని ఇండియ‌న్ సినిమాల్లో ఒక ట్రెండ్ న‌డిచింది. 

ఇపుడు హీరోయిన్ల‌కి కూడా ఇలాంటిది మొద‌ల‌వుతుంది. ఇందులో స‌మంత త‌న‌కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. వ‌ర్షం ప‌డుతుండ‌గా గొడుగుతో సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆమె ఇంట్ర‌డిక్ష‌న్ షాట్‌. "మ‌జిలీ" సినిమాలో అదే. ఇపుడు తాజాగా విడుద‌లైన "ఓ బేబీ"లోనూ అంతే. అలాగే "మ‌జిలీ" సినిమాలో కూడా క‌థ చాలా జ‌రిగిన త‌ర్వాత ఎంట్రీ ఇస్తుంది. "ఓ బేబీ"లోనూ 30 నిమిషాల త‌ర్వాతే ఆమె ఎంట్రీ సీన్‌. రెండు సినిమాలు విజ‌యం సాధించాయి. సో..ఇపుడు ఇది ట్రెండ్ అవుతుందేమో. 

స‌మంత‌పై ఇక‌పై ఎవ‌రు ఇంట్ర‌డిక్ష‌న్ సీన్లు తీసినా ఇలాగే చేస్తారా?