కోరిక నెరవేర్చుకున్న శ్రీముఖి

Sree Mukhi enjoyed Bigg Boss stint!
Monday, November 11, 2019 - 10:00

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు నాగార్జున, శ్రీముఖిని ఓ ప్రశ్న అడిగాడు. ఒకవేళ హౌజ్ లో విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తావనేది ఆ ప్రశ్న. తనకు 50 లక్షలు వస్తే ఆ మొత్తాన్ని తన తల్లిదండ్రులకు ఇచ్చేస్తానని, పనిలోపనిగా తను కూడా మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తానని తెలిపింది. కట్ చేస్తే, బిగ్ బాస్ లో శ్రీముఖి ఓడిపోయింది. అయితే ఆమె ఓడిపోయినప్పటికీ తన కోరిక మాత్రం నెరువేర్చుకుంది.

బిగ్ బాస్ సీజన్ 3 ముగిసిన వెంటనే మాల్దీవులు చెక్కేసింది శ్రీముఖి. తన క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్జే చైతూ, యాంకర్ విష్ణుప్రియతో కలిసి ఆమె మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఎప్పటికప్పుడు షేర్ చూస్తే అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత ఓడిపోయిన బాబా భాస్కర్, వరుణ్ సందేష్ లాంటి వాళ్లు మీడియా ముందుకు రాలేదు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కాస్త టైమ్ తీసుకుంటున్నారు. శ్రీముఖి కూడా ఇలానే ఇంటికి పరిమితమౌతుందని అంతా భావించారు. కానీ రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి మాత్రం ఇలా మల్దీవుల్లో వాలిపోయింది. బిగ్ హౌజ్ లో ఉన్న వంద రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది ఈ బుల్లితెర బ్యూటీ.